»Hyderabad As A Carafe For Naturopathy Minister Harish Rao
Nature cure hospital : ప్రకృతి వైద్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్ : మంత్రి హారీశ్‌రావు
ప్రకృతి వైద్యానికి తెలంగాణ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి హారీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. ప్రకృతి వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా సీఎం కేసీఆర్ (CM KCR) కృషి చేశారని హారీశ్‌రావు తెలిపారు .సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా పనిచేస్తున్నదని వెల్లడించారు.
ప్రకృతి వైద్యానికి తెలంగాణ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి హారీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. ప్రకృతి వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా సీఎం కేసీఆర్ (CM KCR) కృషి చేశారని హారీశ్‌రావు తెలిపారు .సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా పనిచేస్తున్నదని వెల్లడించారు.హెల్త్‌హబ్ (Healthhub) అయిన హైదరాబాద్‌లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారని, ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం వచ్చేలా నేచర్ క్యూర్ దవాఖాన ఎదుగాలన్నారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలో (Nature cure hospital) రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వసతులు, అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) తో కలిసి మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao)మాట్లాడుతూ.. రూ.10 కోట్లతో ఈ ఆసుపత్రిను అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇంకా మరిన్ని నిధులు ఇస్తామన్నారు. కొత్తగా అభివృద్ది చేసుకున్న ఈ హాస్పిటల్‌ను ప్రారంభించుకోడం సంతోషంగా ఉందని చెప్పారు. నేచర్ క్యూర్ ఆసుపత్రికి మంచి పేరు ఉంది. ప్రతి సంవత్సరం 3 వేల మంది ఇన్ పేషెంట్లు, 10 వేల మంది ఔట్ పేషెంట్లకు పైగా చికిత్స పొందుతున్నారు. పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాటేజీల కోసం బుక్ చేసుకోవాలంటే కనీసం నెల రోజుల ముందు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు(Government officials), ప్రజా ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ చికిత్స పొందుతున్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడిచారు.
1949లోనే ఈ దవాఖానను ఏర్పాటు చేశారని, అయితే ఆదరణకు నోచుకోక, నాటి ప్రభుత్వాలు పట్టించుకోక పేషెంట్లు ఇబ్బంది పడేవారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో మంత్రి హరీశ్ రావు ఈ హాస్పిటల్‌ను అద్భుతంగా తీర్చదిద్దారని, ప్రైవేటుకు ధీటుగా దీనిని అభివృద్ధి చేయడం గొప్ప విషయమన్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలను బాగా అభివృద్ధి చేశారని వెల్లడించారు. ఏదైనా రోగం వస్తే వందలో 80 మంది సర్కారు దవాఖానకే వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 62 శాతం పెరిగాయని స్పీకర్ పోచారం (Speaker pocharam) అన్నారు.
Attended the inaugural ceremony of renovated facilities at Nature Cure Hospital along with Speaker Pocharam Srinivas Reddy Garu, Colleague Minister Harish Rao Garu, CS Smt Shanti Kumari Garu, Mayor Smt Vijayalaxmi Garu, Deputy Mayor Smt Srilatha Garu & Other Dignitaries. pic.twitter.com/mb4UgyVLOY
— Talasani Srinivas Yadav (@YadavTalasani) April 8, 2023