Birthday special : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పుష్ప (Puspa) లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత పుట్టినరోజు కావడంతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్ స్టార్ (Tollywood star) హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బన్నీ ఎంతో కష్టపడ్డాడు. యాక్టింగ్, డాన్సులతోనే కాకుండా, స్టైలింగ్ లోనూ తన స్పెషాలిటీ చూపించాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పుష్ప (Puspa) లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత పుట్టినరోజు కావడంతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
టాలీవుడ్ స్టార్ (Tollywood star) హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ… తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బన్నీ ఎంతో కష్టపడ్డాడు. యాక్టింగ్, డాన్సులతోనే కాకుండా, స్టైలింగ్ లోనూ తన స్పెషాలిటీ చూపించాడు.
కేవలం తెలుగులోనే కాకుండా, పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ (Pan India Star) గా వెలుగొందుతున్న బన్నీ.. ఈరోజు (ఏప్రిల్ 8) తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. అంతేకాదు ఈ ఏడాదితో ఇండస్ట్రీలో 20 ఏళ్ళ సినీ కెరీర్ ని పూర్తి చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ (stylish star) నుంచి ఐకాన్ స్టార్ గా మారే వరకూ అల్లు అర్జున్ సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడిగా, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Arvind) తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు అర్జున్. హీరోగా లాంచ్ అవ్వడానికి ముందే పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ‘విజేత’ సినిమా(Vijeta movie)తో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన బన్నీ.. ‘స్వాతిముత్యం(Swatimutyam)’ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు.
ఇక 18 ఏళ్ళ వయసులో ‘డాడీ’ మూవీలో డాన్సర్ గా నటించి, అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తరువాత 2003 లో ‘గంగోత్రి’ సినిమా(Gangotri movie) తో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అల్లు అర్జున్ హీరోగా డెబ్యూట్ చేశాడు. ఈ సినిమా మార్చి 28వ తేదీ నాటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఇక పుష్ప (Pushpa) సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్(All time record) క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అన్ని అంచనాలు తగ్గట్టే సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టించింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప.