కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవలేకపోయినప్పుడల్లా కాంగ్రెస్.. భారత వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ను అమ్ముకున్నారని కాంగ్రెస్ పదేపదే చెబుతోందని, తద్వారా వాటిని బలహీనపరుస్తోందని రిజిజు అన్నారు.