సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ర్యాగింగ్‌పై విద్యార్థులను హెచ్చరించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యా సంస్థల్లో ర్యాగింగ్ తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు.