W.G: మొగల్తూరులోని కేపీ పాలెం బీచ్‌లో ఆదివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. మొగల్తూరులోని కొత్తపాలేనికి చెందిన శ్రీహర్ష కుటుంబీకులతో ఆదివారం బీచ్‌కు వచ్చాడు. సముద్ర స్నానం చేస్తూ అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయాడు. యువకుని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.