ELR: ఏలూరు వెన్నవెళ్ళవారి పేటలో బాల్య వివాహాలు, గర్భధారణ వల్ల కలిగే నష్టాలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రత్నం ప్రసాద్ ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్యవివాహాల వలన ఆరోగ్య సమస్యలతో పాటు తల్లి, బిడ్డ మరణాలు సంభవిస్తాయన్నారు. 18 సంవత్సరాల నిండిన తర్వాత మాత్రమే మహిళలు పూర్తి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.