KMM: తిరుమలయపాలెం (M) ఎర్రగడ్డలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ యువతి వైజాగ్లో ఆదివారం ఉరేసుకొని చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. అదే గ్రామానికి చెందిన నరేశ్ అనే వివాహితుడు యువతిని ప్రేమ పేరుతో వైజాగ్ తీసుకెళ్లాడు. 15 రోజుల తర్వాత యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపనతో యువతి లాడ్జిలోనే ఉరివేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.