తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఫుల్ బిజీబిజీగా గడిపారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీ బేగంపేట (Begumpet) ఎయిర్ పోర్టులో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad)కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) స్వాగతం పలుకగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వైష్ణవ్ తేజ్, ఎంపీలు సోయం బాపురావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును (Vander Bharat Express) ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశను, పలు రైల్వే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణలో నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంగో గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అంతకుముందు రైలులో ప్రధాని చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో ప్రశ్నలు అడిగారు.