మెదక్: దుబ్బాక మండలం రామక్కపేట సాంఘిక సంక్షేమ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ శారద వెంకటేశ్ తెలిపారు. పీజీటీ, ఫిజికల్ సైన్స్, పీజీటీ ఇంగ్లిష్ ఖాళీలుగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు మాత్రమే ఈ నెల 28న తమ సర్టిఫికెట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.