MBNR: జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ దేవరకద్ర మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన నర్సింహారెడ్డికి ధైర్యం చెప్పి, పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని తీవ్రంగా విమర్శించారు.