fire accident : ఢిల్లీ పీవీసీ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం..
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (fire accident) చోటుచేసుకుంది . టిక్రీ కలాన్‌లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (fire accident) చోటుచేసుకుంది . టిక్రీ కలాన్‌లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. కిలోమీటర్ దూరంలో కూడా మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సమల్కా కపషేరాలోని సోనియా గాంధీ క్యాంప్‌లో (Sonia Gandhi camp) ఉన్న కలప గోదామ్‌లో (Lumber store Godown) అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్కే దువా(Chief Fire Officer SK Dua) తెలిపారు. వీలైనంత తొందరగా మంటలను ఆర్పివేస్తామని ఆయన వెల్లడించారు
#WATCH | Delhi: Morning visual from Tikri Kalan area where fire broke out in a plastic godown during the early hours today. 25 fire tenders at the spot. No casualties reported so far. https://t.co/yhTyNp2M4ypic.twitter.com/Clr2ul8CmF