Bhogapuram Airport Is Launched Five Years Ago:Chandrababu
Bhogapuram Airport:భోగాపురం ఎయిర్ పోర్టును ఏపీ సీఎం జగన్ (cm jagan) ఈ రోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2026లో మళ్లీ తానే సీఎం అవుతానని.. జాతికి అంకితం చేస్తానని ప్రకటించారు. సీఎం జగన్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) ఖండించారు. ఆ ఎయిర్ పోర్టును ఐదేళ్ల క్రితమే (five years ago) ప్రారంభించామని గుర్తుచేశారు. సొంత ప్రచారం కోసం జగన్ ఇలా చేస్తున్నారని విమర్శించారు.
ఎయిర్ పోర్టు ప్రారంభం పేరుతో పత్రికలకు (papers) ఫుల్ పేజీ యాడ్ (add) ఇచ్చారని.. దీంతో ప్రజా ధనం భారీగా ఖర్చు చేశారని మండిపడ్డారు. హిందూజా, అమూల్‌కు వేల కోట్ల ప్రభుత్వం ధనం ధారాదత్తం చేస్తున్నారని.. దీంతో భారీగా కమీషన్లు దండుకుంటున్నారని చంద్రబాబు (chandrababu) ఆరోపించారు. జగన్ (jagan) చేసే జిమ్మిక్కులను జనం నమ్మే స్థితిలో లేరని చెప్పారు.
అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు (farmers) అండగా నిలవడం లేదని మండిపడ్డారు. వర్షాలపై ముందస్తు సమాచారం ఇస్తే నష్టం ఈ స్థాయిలో జరిగేది కాదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండాలని టీడీపీ క్యాడర్‌కు (tdp cadre) పిలుపునిచ్చారు. అన్నదాతలను సీఎం (cm), మంత్రులు (ministers) పరామర్శించడం లేదని విమర్శించారు.
వరి, మక్క రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు (chandrababu) డిమాండ్ చేశారు. మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు. పిడుగుపడి చనిపోయిన రైతు కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. వర్షాలతో రంగు మారిన ధాన్యానికి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పారు.