లైగర్ పరాజయంతో నిరాశకు గురైన రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎట్టకేలకు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వరుస సినిమాలు (Movies) చేయాలని అనుకుంటున్న సమయంలో ఆ ఫ్లాప్ తో కోలుకోలేని దెబ్బతిన్నాడు. ఓటమి నుంచి తేరుకుని తన తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు. ఇప్పటికే శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో సమంతతో (Samantha) కలిసి ఖుషీ (Khushi Movie) సినిమా చేస్తున్న విజయ్ తన తదుపరి సినిమాను కూడా పట్టాలెక్కించాడు. తన 12వ (VD12 Movie) సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు.
‘జెర్సీ’తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. రౌడీ పక్కన కొంటె పిల్ల శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో గూఢాచారి పాత్రలో విజయ్ మెరుస్తున్నాడు. నాలుగు నెలల కిందట ఈ సినిమాకు సంబంధించి ఔట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై విజయ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.