»Vijay Deverakonda And Rashmika Wedding Can It Be Fixed
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి? ఇది ఫిక్స్ అయిపోండి?
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్యన సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని.. చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే క్లారిటీ వచ్చేశారు. అందుకు కారణం రష్మిక చేసిన కామెంట్స్ అనే చెప్పాలి.
Vijay Deverakonda and Rashmika wedding? Can it be fixed?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా పుకార్లు పుడుతునే ఉన్నాయి. కానీ ఈ ఇద్దరు తాము మంచి ఫ్రెండ్స్ అని చెబుతూ వస్తున్నారు. అయితే.. తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ మాత్రం ఈ ఇద్దరి మధ్య లవ్ ఉందనేలా ఉన్నాయని అంటున్నారు. లేటెస్ట్గా ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయింది రష్మిక. ఈ సందర్భంగా.. ఆనంద్ దేవరకొండ అడిగిన పలు ప్రశ్నలకు రష్మిక సరదాగా సమాధానాలిచ్చింది. మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్ ఎవరు? అని అడగ్గా.. ఫాన్స్ అందరూ రౌడీ రౌడీ అని గట్టిగా అరిచారు. దీంతో.. ఆనంద్ నువ్ నా ఫ్యామిలీ రా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా? అని రష్మిక చెప్పుకొచ్చింది.
కానీ సమాధానం చెప్పాల్సిందే అని ఆనంద్ అనగా.. రౌడీ బాయ్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక రష్మిక మాటల్ని బట్టి.. రౌడీ ఫ్యాన్స్ ఇద్దరి మధ్య ప్రేమ నిజమేనా? అని చర్చించుకుంటున్నారు. పైగా.. ఫేవరెట్ డెస్టినేషన్ ‘వియాత్నాం’ అని కూడా చెప్పింది అమ్మడు. విజయ్, రష్మికలు తొలిసారి కలిసి వెళ్లిన ఫారెన్ ట్రిప్ వియాత్నాం అని.. అందుకే రష్మిక ఆ పేరు చెప్పిందని అంటున్నారు. అంతేకాదు.. త్వరలోనే రౌడీ కుటుంబంలోకి రష్మిక అడుగుపెట్టబోతోందన్న టాక్ కూడా ఊపందుకుంది. అందుకే.. రష్మిక ఇలా హింట్ ఇచ్చిందని అంటున్నారు. మరి దీనిపై రష్మిక, రౌడీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.