»Hyderabad Bjp Corporators Misbehaved Officiers Boycotted In Ghmc Council Meeting
GHMC రెచ్చిపోయిన బీజేపీ కార్పొరేటర్లు.. జీహెచ్ఎంసీ సమావేశం ఉద్రిక్తత
మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో గందరగోళం ఏర్పడింది. జీహెచ్ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. విపక్ష పార్టీల కార్పొరేటర్లు బీభత్సం సృష్టించడంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీజేపీ కార్పొరేటర్లు (Corporators) రెచ్చిపోయి అధికారులపై దూషించారు. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. తమను దూషించడంపై అధికారులు కలత చెందారు. ఇలాగైతే తాము సమావేశంలో ఉండలేమని చెప్పడంతో అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. అధికారులు సమావేశం బహిష్కరించడం జీహెచ్ఎంసీ చరిత్రలో తొలిసారి ఇదే కావడం గమనార్హం.
ట్యాంక్ బండ్ (Tank Bund)పై ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు. దీంతో సమావేశంలో గందరగోళం (Clashes) ఏర్పడింది. సమావేశం ఉద్రిక్తతగా మారడంతో పోలీసులు (Police) రంగంలోకి దిగారు. బీజేపీ కార్పొరేటర్లు శాంతించకపోవడంతో భద్రతా సిబ్బంది వారిని బయటకు పంపించారు. సభలో జరిగిన పరిణామాలపై కలత చెందిన వాటర్ వర్క్స్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సభను బహిష్కరించారు. సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారు.
అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalaxmi) మీడియాతో మాట్లాడారు. ‘సభ్యుల వినతి మేరకు సమావేశం ఆలస్యంగా ప్రారంభించాం. బీజేపీ కార్పొరేటర్ల ప్రవర్తనతో అధికారులు కలత చెందారు. వారి తీరుకు నిరసనగానే అధికారులు సమావేశం బహిష్కరించారు. కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు బాధాకరం’ అని విజయలక్ష్మి తెలిపారు. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం మళ్లీ ఎప్పుడూ నిర్వహించేది త్వరలో చెబుతామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.