రాజకీయ దురంధరుడు శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామాతో జాతీయ రాజకీయాలతో పాటు మహారాష్ట్రలో (Maharashtra) సంచలనంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party -NCP) జాతీయ అధ్యక్ష పదవికి (Resignation) రాజీనామా చేయడంతో కలకలం ఏర్పడింది. అయితే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ (NCP) నాయకులతో పాటు సాధారణ కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు. ఆయన రాజీనామాతో ఓ కార్యకర్త మనస్తాపానికి గురయ్యాడు. రాజీనామాపై వెనక్కి తగ్గాలని కోరుతూ ఆ కార్యకర్త రక్తంతో (Blood) లేఖ రాశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజీనామా నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే సందీప్ కాలే (Sandeep Kale) అనే కార్యకర్త శరద పవార్ రాజీనామా విరమించుకోవాలని కోరుతూ రక్తంతో లేఖ రాశాడు. ఆయన మొదటి నుంచి పవార్ అంటే అమితమైన అభిమానం. శరద్ పవార్ గురువుగా.. మెంటర్ గా భావిస్తున్నాడు. ‘మీరు రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’ అని లేఖలో (Letter) రక్తంతో రాశాడు. ‘మీ నిర్ణయం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. మీ అనూహ్య నిర్ణయంతో మేమంతా అనాథలయ్యాం (Orphan). పవార్ సార్ మీరు మాకు మెంటర్, మార్గదర్శకులు. దయచేసి మీ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’ అని ఆ లేఖలో సందీప్ కాలే కోరాడు.