VKB: యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సీఐ వెంకట్ పిలుపునిచ్చారు. మోమిన్పేట్ మండల కేంద్రంలో ’99 డేస్’ ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ అనర్థాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.