»Hyderabad Income Tax Raids On Shopping Malls In Telugu States
IT Raids on Shopping Malls భయాందోళనలో మాల్స్.. కొనసాగుతున్న ఐటీ దాడులు
మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం షాపింగ్ మాల్స్ (Shopping Malls) భయాందోళన చెందుతున్నారు. తెలంగాణతో (Telangana) పాటు ఏపీలోని (AP) షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. మాల్స్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax) అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)లో ఉన్న ప్రముఖ మాల్స్ పై తనిఖీలు జరుగుతున్నాయి. బుధవారం కూడా దాడులు కొనసాగాయి.
ఐటీ శాఖ అధికారులు ఐదు రోజుల సెర్చ్ వారెంట్ (Search Warrant) తీసుకుని దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు 20కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు (Raids) చేపట్టారు. 40 బృందాలుగా విడిపోయిన అధికారులు దాడులు జరుపుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 40 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, ఈసీఐఎల్, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై (IT Returns) అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ (Auditing) వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు. సీఆర్పీఎఫ్ (CRPF) పోలీసులతో బందోబస్తుగా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కళామందిర్ గ్రూప్స్, వరమహాలక్ష్మి, కేఎల్ఎం, కాంచీపురం వంటి వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.