PDPL: పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్లలో ఎదిగిన రాష్ట్రంగా మార్చితే, కాంగ్రెస్ పాలన దాన్ని వెనక్కి పడేసిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు మంథనిలో సంక్రాంతి సందర్భంగా గురువారం పతంగులు ఎగరవేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆకాశమే హద్దుగా ఎదగాలన్నారు. కాంగ్రెస్ పాలనకు అంతం పలికే దిశగా కార్యకర్తలు పతంగుల్లా ఎగరాలని పిలుపునిచ్చారు.