»Breaking News Actor Director Comedian Manobala Passed Away At 69
Breaking ప్రముఖ హాస్య నటుడు మనోబాల కన్నుమూత.. సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
సినీ పరిశ్రమలో (Movie Industry) తీవ్ర విషాదం ఏర్పడింది. తెలుగు ప్రజలకు సుపరిచితులైన ప్రముఖ హాస్య నటుడు మనోబాల (Manobala) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో (Health Critical) బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ (Kollywood) దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తీరని లోటు అని పేర్కొన్నారు.
జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్న మనోబాల అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించింది. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చెన్నెలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 8 డిసెంబర్ 1953లో జన్మించిన మనోబాల 1970లో సినీ రంగంలోకి ప్రవేశించారు. నటుడిగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో రాణించారు. 1979లో భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా మనోబాల చేరారు. ఆ తర్వాత చాలా సినిమాలకు పని చేశారు.