AP: ఆంధ్రా యానివర్సిటీలో విద్యార్థి మృతిపై మంత్రి లోకేష్ స్పందించారు. ‘గురువారం ఏయూలో విద్యార్థి ఫిట్స్‌తో చనిపోయారు. అంబులెన్స్‌లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం. కొందరు క్లాస్‌లు జరగకుండా కావాలనే అడ్డుకుంటున్నారు. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉంది. రాజకీయం చేస్తామంటే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
HYD: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పుష్పాలు, కరెన్సీతో అందంగా అలంకరించారు. శ్రీ గజలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
సంగారెడ్డి: నారాయణఖేడ్ RTC డిపో ఆధ్వర్యంలో రేపటి నుంచి దసరా స్పెషల్ బస్సు లు నడపనున్నట్లు DM మల్లేశం శుక్రవారం తెలిపారు. ఖేడ్ నుంచి JBS సికింద్రాబాద్‌కు 10 స్పెషల్ బస్సులు, అదేవిధంగా లింగంపల్లి వరకు 10 స్పెషల్ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. RTC బస్సుల్లోనే సురక్షిత ప్రయాణమని పేర్కొన్నారు.
NTR: గంపలగూడెం ఎస్సై ఎస్. శ్రీనివాస్ శుక్రవారం తన సిబ్బందితో కలిసి తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను నిలిపివేసి, వాటి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులకు అవసరమైన సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సుధీర్ కూడా పాల్గొన్నారు.
NTR: గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం పర్యవేక్షించారు. ఈనెల 27న హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ప్రజలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.
BDK: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇల్లెందు, కోయగూడెం, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లోని సింగరేణి గనుల్లోకి నీరు చేరడంతో 40,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ముఖ్యంగా మణుగూరు ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి, మట్టి తీసే పనులు నిలిచిపోయాయి.
BHPL: కాటారం మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం శనివారం ఉద్యోగులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు MPDO రాజు శుక్రవారం తెలిపారు. ZPTC, MPTC ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఉదయం 10 నుంచి 11:30 గం వరకు, GP ఎన్నికల్లో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు 11:30 నుంచి 1:30 గం వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
తమిళ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 28న మేకర్స్.. ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ వారు పోస్టర్ షేర్ చేశారు.
WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలోని దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. అనంతరం భక్తులు అమ్మవారిని పుష్పాలతో అలంకరించారు. అర్చకులు కలకోట గోపాల్ చారి ఆధ్వర్యంలో, కలకోట శ్రావణ్, కలకోట రామాచారి, ప్రశాంత్, పూజలు నిర్వహిస్తున్నారు.
MBNR: జవహర్ నవోదయాలో సీటు సాధించిన విద్యార్థిని మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిత్య నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు ప్రభాకర్‌ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ కాంక్షించారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్‌లోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయంలో దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. అర్చకులు పురుషోత్తమ చార్యులు వేద మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ కుంకుమ పూజలో మహిళా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
AP: ఆంధ్రా యానివర్సిటీలో తీవ్ర అస్వస్థతతో మణికంఠ అనే విద్యార్థి గురువారం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు వీసీ చాంబర్ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మణికంఠ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయూ పాలకులు, డిస్పెన్సరీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఏయూ వీసీ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్నారు.
ప్రకాశం: కంభం మండల పరిషత్ కార్యాలయంలో ఓన్ సోర్స్ రెవెన్యూ (OSR)పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు స్వీయ ఆదాయ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం అవసరమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా ఆస్తి పన్ను, మార్కెట్ ఫీజులు, భవన అనుమతులు, నీటి వినియోగ ఛార్జీలు వంటి అంశాలపై వివరాలు అందించారు.
SKLM: పోలాకి మండలం మబగాం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు శుక్రవారం ఉదయం తెలిపారు. మబగాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఈ దుస్థితి నెలకొందని అన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుందన్నారు. సంబంధిత శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి రోగాల బారి నుండి కాపాడాలంటూ తెలియజేశారు.
VSP: గాజువాక నియోజకవర్గంలోని 65వ వార్డు, వాంబే కాలనీలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమం నిర్వహించారు. ‘డోర్ టూ డోర్’ పర్యటిస్తూ, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. నిల్వ ఉన్న నీటి తొలగింపు , దోమల లార్వాలను నివారించడం వంటి చర్యలను పరిశీలించారు.