తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సత్యం సుందరం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది. రేపు సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్ హైదరాబాద్‌లో దీన్ని నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 28న రిలీజ్ కానుంది.