PDPL: రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం సాయంత్రం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం రిసెప్షన్ సిబ్బందిని ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికి భరోసా, నమ్మకం కల్పించాలని అన్నారు.