SKLM: మెలియాపుట్టిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్లో మిగులు సీట్లు భర్తీకి ఈనెల30లోపు పాఠశాలకు వచ్చి దరఖాస్తులు అందించాలని ప్రిన్సిపాల్ ఎం.రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2వ తేదీన మెలియాపుట్టిలో కౌన్సెలింగ్ ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో సంప్రదించాలని కోరారు.