SKLM: సారవకోట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. మండలంలో వివిధ సమస్యలపై చర్చించారు. ఇందులో ఎంపీడీవో, ఎంపీపీ, సర్పంచ్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.