కృష్ణా: టీడీపీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని టీడీపి జిల్లా నేత లకనం నాగాంజనేయులు హెచ్చరించారు. శనివారం ఆయన నాగాయలంకలో విలేఖర్లతో మాట్లాడుతూ పార్టీ అనుమతి లేకుండా కొందరు గ్రామ కమిటీల ఎంపికకు సమావేశాలు నిర్వహిస్తు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పార్టీ పటిష్టత దెబ్బతింటుందన్నారు.