SKLM: టెక్కలి మండలం నంబాళ్లపేట గ్రామం వద్ద శనివారం పిడుగుపాటుకు గురై శివ(26) అనే యువకుడు మృతి చెందాడు. సంతబొమ్మాలి మండలం పల్లికవానిపేట గ్రామానికి చెందిన యువకుడు నంబాలపేట వద్ద ఉన్న క్రమంలో ఒక్కసారిగా యువకుడిపై పిడుగుపడడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటీన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.