ATP: ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా శనివారం గుత్తి గేట్స్ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలను పట్టుకుని తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు. ముందుగా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు.