ASR: ప్రభుత్వ భూముల ఆక్రమణల స్వాధీనంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని శనివారం కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఆక్రమణలదారులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. బంజరు భూములు, ప్రభుత్వ భూములు, నీటి పారుదల భూములు, చెరువుల ఆక్రమణలను ఈనెల 31లోగా గుర్తించి రిపోర్టులు సమర్పించాలని చెప్పారు.