సత్యసాయి: పుట్టపర్తిలోని మామిళ్లకుంట క్రాస్ రోడ్ వద్ద మినీ మహానాడు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత జ్యోతి వెలిగించి, ఎన్టీఆర్కు పూలమాలలతో నివాళి అర్పించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.