ASR: పాడేరు ఐటీడీఏ పరిధిలోని 20గురుకులం ఏకలవ్య విద్యాలయాల్లో పనిచేస్తున్న ఆదివాసీ మహిళా సెక్యూరిటీ గార్డులకు మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ డిమాండ్ చేశారు. శనివారం సెక్యూరిటీ గార్డులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సుమారు 100 మంది సెక్యూరిటీ గార్డులు మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు.