ప్రకసం: పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శనివారం సందర్శించారు. వేలం కేంద్రంలో పొగాకు అమ్మకాలను ఆయన పరిశీలించారు. వేలం నిర్వహణ అధికారి గిరి రాజ్ కుమార్తో మాట్లాడి ధరలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.