సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా 44 మంది టీడీపీ కార్యకర్తలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. మంత్రి చేతుల మీదుగా బండ్లను అందించగా, అందరూ హర్షం వ్యక్తం చేశారు.