‘కన్నప్ప’ మూవీ టీంకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పాడు. ‘భైరవం’ మూవీ ఈవెంట్లో ‘శివయ్యా’ అనే డైలాగ్‌ను వేరేలా వాడానని, అలా చేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఆ మూవీ కోసం చాలామంది కష్టపడ్డారని, ఒకరు చేసిన తప్పుకు సినిమా మొత్తాన్ని నిందించడం సరికాదని చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇటీవల మనోజ్.. శివయ్యా అంటే శివుడు రాడని, మనసారా తలుచుకుంటే ఏదొక రూపంలో వస్తాడని అన్నాడు.