SRD: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను www.bsetelangana.cgg.gov.in సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ మూడవ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు.