HYD: కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన పాలిసెట్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. RR జిల్లాలో హయత్ నగర్ ప్రాంతానికి చెందిన కందగంట్ల తనూజ, మేడ్చల్ జిల్లాలో చెంగిచెర్లకు చెందిన కోలకోటి వినూత్న, HYD జిల్లాలో కాచిగూడ షేక్ మహమ్మద్ ఆయా జిల్లాల ఎంపీసీ స్ట్రీమ్ ఫస్ట్ ర్యాంకర్లుగా నిలిచారు. బైపీసీ, ఎంపీసీ స్ట్రీమ్‌కు ప్రత్యేక ర్యాంకులను అధికారులు ప్రకటించారు.