TG: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ పేరు ఈడీ ఛార్జ్ షీట్లో ఉందని మాజీమంత్రి KTR అన్నారు. ‘రేవంత్ పేరు ఈడీ ఛార్జ్ షీట్లో ఉండటం రాష్ట్రానికి అవమానకరం. యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. మూటలు మోసి పదవిని కాపాడుకుంటున్నారు. తనను తాను కాపాడుకోవటానికి ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకున్నారు. ఇప్పటికీ రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదు’ అంటూ మండిపడ్డారు.