సత్యసాయి: పెనుకొండ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సవితమ్మ చేతుల మీదుగా బడుగు బలహీన వర్గాలకు శనివారం తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమానికి కార్యకర్తలంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.