MBNR: నల్లమల అటవీ అందాలు, కృష్ణా తీర సొగసులు, తిలకించేందుకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. అమ్రాబాద్ మండలం నల్లమల అడవిలోని దోమలపెంట ఫారెస్ట్ చెక్ పోస్టు దగ్గరలో ఈ స్పాట్ ఉంది. కృష్ణా నది పక్కనే ఉన్న అడవుల అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇది ఆక్టోపస్ రూపంలో మెలికలు తిరిగి ఉండటంతో ఈపేరు పెట్టారు. ప్రకృతి ప్రేమికులు ఈ వ్యూ పాయింట్ మంత్రముగ్ధులను చేసింది.