SRD: ఆందోలు- జోగిపేట మున్సిపాలిటీలో నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి శనివారం ప్రకటనలో తెలిపారు. పాలిథిన్ కవర్లపై దాడులు చేసేందుకు మున్సిపాలిటీలో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరు వద్దన్నా లభ్యమైతే 1000 రూపాయలకు పైగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.