భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ తీరును భారత్ ఎండగట్టింది. సైనిక ఘర్షణలో తమ పౌరులపై పాక్ దాడి చేసిన విషయాన్ని భారత్ గుర్తుచేసింది. కపటత్వ ప్రదర్శనలో పాక్ ఆరితేరిందని ఆరోపించింది. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని పాక్కు మమ్మల్ని విమర్శించే అర్హత లేదని UNలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ స్పష్టం చేశారు. కాగా, ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తోందని భారత్ ఆరోపిస్తోంది.