మన్యం: ప్రస్తుత జీవన విధానంలో యోగాను ప్రతీ ఒక్కరూ దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అడ్డాపుశీల గ్రామంలో శుక్రవారం యోగా సెషన్ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. డిఎంహెచ్వో, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులతో కలిపి యోగాసనాలు చేసారు.