NLR: మహానాడు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పండుగ లాంటిదని బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఆమె నెల్లూరు జిల్లా మహానాడు సభకు శుక్రవారం హాజరయ్యారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన చర్చలు, తీర్మానాలలో ఆమె పాల్గొన్నారు.