BHPL: కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకముగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల్లో 9వ రోజు శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సరస్వతీ ఘాట్ వద్ద నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని గమనించిన పోలీసులు ప్లాస్టిక్ కుర్చీ సహాయంతో మోస్తూ నది తీరం నుంచి పుష్కర ఘాట్ మెట్లు ఎక్కించి మానవత్వాన్ని చాటుకున్నారు.