AP: సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఆ వివరాలను సీఎం చంద్రబాబు తాజాగా వెల్లడించారు. రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. దీనికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.