NLR: కొడవలూరు మండలంలోని బసవాయపాలెం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం కిశోరి వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల బాలికలకు ఉన్నత విద్యా నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. విద్యతోనే సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గుతాయన్నారు. ప్రస్తుత సమాజంలో విద్య చాలా అవసరమని సూపర్వైజర్ నిర్మల తెలిపారు.