ELR: భీమడోలు మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో జూన్ 21 వరకు యోగా తరగతులు నిర్వహిస్తున్నామని ఎంపీడీవో పద్మావతి దేవి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర – 25 కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 7గం నుంచి 8గం వరకు యోగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ యోగా తరగతులకు ఆహ్వానితులేనని, శిక్షణ ఉచితం అని ఎంపీడీవో తెలిపారు.