ప్రకాశం: ఈనెల 28న పొదిలిలో జరిగే మాజీ సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేయాలని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు. దర్శిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ముండ్లమూరు, దర్శి, తాళ్లూరు మండలాల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొగాకు రైతులకు అండగా నిలబడిన జగనన్న పోరుబాటలో కార్యకర్తలు పాల్గొనాలన్నారు.