సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం రూరల్, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో 16 లబ్దిదారులకు మొత్తం రూ.14,58,612 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. చిగిచెర్ల, బడన్నపల్లి, మల్లకాలువ, నెహ్రూనగర్, కామిరెడ్డిపల్లి, చిల్లవారిపల్లి, పిన్నధరి, రావులచెరువు, కునుతురు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఈ చెక్కులు అందజేశారు.