VZM: చీపురుపల్లి మండలంలోని నిమ్మలవలసలో శ్రీ నీలమ్మతల్లి సంబరాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. వ్యవసాయం, కళలు క్రీడారంగాల్లో గుర్తింపు పొందిన నిమ్మలవలసలో వందేళ్ళకు పైగా నీలమ్మ సంబరాల సాంప్రదాయం కొనసాగుతోంది. కార్యక్రమాలకు ఖరగ్పూర్, నాగ్పూర్ తూర్పుగోదావరి మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు.